Araku: అరకు ఆసక్తికరం... తండ్రిపై కుమార్తెను బరిలోకి దింపిన కాంగ్రెస్!

  • అరకు నుంచి టీడీపీ తరఫున కిశోర్ చంద్రదేవ్
  • ఆయన కుమార్తె శ్రుతీదేవిని బరిలోకి దింపిన కాంగ్రెస్
  • వైసీపీ తరఫున గొడ్డేటి మాధవి
ఆంధ్రప్రదేశ్ కు జరగనున్న ఎన్నికల్లో అరకు లోక్ సభ స్థానం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేశ్ బరిలోకి దిగుతుండగా, ఆయన కుమార్తె శ్రుతీదేవిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. నిన్న రాత్రి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో శ్రుతీదేవి పేరు ఖరారు కాగా, ఆమె తన తండ్రిని సవాల్ చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గొడ్డేటి మాధవి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అరకు లోక్ సభ నియోజకవర్గంలో ఈ దఫా త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Araku
Kishore Chandradev
Sruthidevi
Goddeti Madhavi

More Telugu News