priyaraman: అందుకే సినిమాలకి దూరమయ్యాను: సీనియర్ హీరోయిన్ ప్రియారామన్

  • చెన్నైలోనే వుంటున్నాను
  • పెళ్లి తరువాత బ్రేక్ తీసుకున్నాను
  •  పిల్లలకే పూర్తి సమయం కేటాయించాను
తెలుగు తెరకి పరిచయమైన నిన్నటి తరం అందమైన కథానాయికలలో ప్రియారామన్ ఒకరు. 'మా ఊరి మారాజు' .. 'శుభసంకల్పం' .. 'శ్రీవారి ప్రియురాలు' వంటి సినిమాలు తెలుగులో ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాంటి ప్రియారామన్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నేను చెన్నైలోనే ఉంటున్నాను. అయితే నటనకు దూరంగా ఉండటం వలన, నేను చెన్నైలోనే ఉంటున్నాననే విషయం చాలామందికి తెలియకుండా పోయింది. వివాహమైన తరువాత నేను బ్రేక్ తీసుకున్నాను .. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ల ఆలనా పాలన నాకు ముఖ్యమని అనిపించింది. వాళ్ల బాధ్యతను వేరే వాళ్లకి అప్పగించడం నాకు ఇష్టం లేదు. వాళ్ల దగ్గరే ఉంటూ .. వాళ్లకి కావలసినవి సమకూర్చడంలోనే ఆనందం వుంది. అందువలన వాళ్ల కోసమే పూర్తి సమయాన్ని కేటాయించడం వలన, సినిమాలకి పూర్తిగా దూరమయ్యాను" అని చెప్పుకొచ్చారు.
priyaraman
ali

More Telugu News