Chandrababu: చంద్రబాబు, లోకేశ్, జగన్‌పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

  • చంద్రబాబుకు పోటీగా సురేశ్‌బాబు
  • జగన్‌కు ప్రత్యర్థిగా వేలూరు శ్రీనివాసరెడ్డి
  • లోకేశ్‌ను ఎదురొడ్డేందుకు సిద్ధమైన ఎస్‌కే సలీం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ చీఫ్ చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ప్రతిపక్ష నేత జగన్‌లపై బలమైన అభ్యర్థులను నిలబెట్టినట్టు పేర్కొంది. ఇక, ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రఘువీరా, సాకే శైలజానాథ్‌ (శింగనమల) పేర్లు మాత్రమే సుపరిచితం. కాగా, మిగతా వారి పేర్లు పెద్దగా పరిచయంలేనివి.

మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్‌పై ఎస్‌కే సలీంను పోటీకి నిలబెట్టగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నుంచి సురేశ్‌బాబు బరిలోకి దిగనున్నారు. ఇక, ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా పులివెందుల నుంచి వేలూరు శ్రీనివాసరెడ్డిని నిలబెట్టింది. ఎవరికీ పెద్దగా పరిచయం లేని వీరు దిగ్గజాలను ఎలా ఎదుర్కొంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  
Chandrababu
Nara Lokesh
Jagan
Congress
Assembly Elections
Andhra Pradesh

More Telugu News