Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఈ రాకెట్ నీకు పెద్దదిరా ఇజ్జీ'... టెన్నిస్ బ్యాట్ పట్టిన కొడుకుతో సానియా మీర్జా!

  • ప్రాక్టీస్ కోసం కొడుకుతో వచ్చిన సానియా
  • బ్యాటుతో సందడి చేసిన ఇజాన్
  • ఫోటో పోస్ట్ చేసిన సానియా
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ ల కొడుకు ఇజాన్‌ మీర్జా మాలిక్ అప్పుడే టెన్నిస్ బ్యాట్ పట్టేశాడు. పట్టుమని రెండేళ్లు నిండని ఈ చిన్నారి టెన్నిస్ బ్యాట్ పట్టిన ఫొటోను సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత సంవత్సరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా టెన్నిస్ ప్రాక్టీస్ నిమిత్తం కుమారుడితో కలిసి వచ్చిన ఆమె, బ్యాట్ పట్టిన కొడుకు ఫొటోను పంచుకుంటూ, "ఈ రాకెట్ నీకు కాస్త పెద్దది కావచ్చు ఇజ్జీ" అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ కాగా, ఇజ్జీని టెన్నిస్ ఆటగాడిని చేస్తారా? క్రికెటర్ ను చేస్తారా? అంటూ సానియా, మాలిక్ ల జోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
Saniya Mirza
Izan
Tennis

More Telugu News