హోలీ ఎఫెక్ట్: రేపటి నుంచి 22 వరకు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్
- ఆదేశాలు జారీ చేసిన సీపీ అంజనీ కుమార్
- వాహనాలపై గుంపులుగా ప్రయాణించవద్దు
- రోడ్డుపై హంగామాలు వద్దు
ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని, గుంపులుగా వాహనాలపై ప్రయాణించవద్దని, వాహనాలపై వెళ్తున్న వారిపై రంగులు చల్లరాదని సీపీ హెచ్చరికలు జారీ చేశారు.