Jana Sena: జనసేన నుంచి రెండో జాబితా.. అర్ధరాత్రి విడుదల చేసిన పవన్

  • ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన జనసేన
  • ఏపీలోని 32 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి నేమూరి శంకర్‌ గౌడ్‌
పవన్ సారథ్యంలోని జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలోని 32 అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు ఏపీ లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో ఓ లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 64 అసెంబ్లీ స్థానాలు, ఏపీలో ఏడు , తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన అభ్యర్థుల రెండో  జాబితా ప్రకారం..

లోక్‌సభ అభ్యర్థులు: పంగి రాజారావు(అరకు), బండ్రెడ్డి రాము (మచిలీపట్నం), సయ్యద్‌ ముకరం చాంద్‌ (రాజంపేట), మెట్ట రామారావు-ఐఆర్‌ఎస్‌ ( శ్రీకాకుళం) తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి  నేమూరి శంకర్‌ గౌడ్‌ పేరును ప్రకటించింది.

శాసనసభ అభ్యర్థులు: దాసరి రాజు (ఇచ్ఛాపురం), గేదెల చైతన్య (పాతపట్నం), రామ్మోహన్‌ (ఆముదాలవలస), జి.సన్యాసినాయుడు(మాడుగుల), చింతలపూడి వెంకటరామయ్య(పెందుర్తి), పీవీఎస్‌ఎన్‌ రాజు(చోడవరం), పరుచూరి భాస్కరరావు(అనకాపల్లి), పంతం నానాజీ (కాకినాడ రూరల్‌), రాయపురెడ్డి ప్రసాద్‌(రాజానగరం), అత్తి సత్యనారాయణ(రాజమండ్రి అర్బన్‌), ఘంటసాల వెంకట లక్ష్మి(దెందులూరు), బొమ్మడి నాయకర్‌(నర్సాపురం), అటికల రమ్యశ్రీ(నిడదవోలు), పసుపులేటి రామారావు(తణుకు), జవ్వాది వెంకట విజయరాం( ఆచంట), మేకల ఈశ్వరయ్య(చింతలపూడి), ముత్తంశెట్టి కృష్ణారావు(అవనిగడ్డ), అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌(పెడన), బీవీ రావు (కైకలూరు), పోతిన వెంకట మహేష్‌ (విజయవాడ పశ్చిమ), బత్తిన రాము (విజయవాడ తూర్పు), షేక్‌ రియాజ్‌ (గిద్దలూరు),  టి.రాఘవయ్య (కోవూరు- నెల్లూరు జిల్లా), డాక్టర్‌ కె.రాజగోపాల్‌ (అనంతపురం అర్బన్‌), సుంకర శ్రీనివాస్‌ (కడప), ఎస్‌కే హసన్‌ బాషా (రాయచోటి), బొటుకు రమేష్‌ (దర్శి), రేఖా గౌడ్‌ (ఎమ్మిగనూరు), చింతా సురేష్‌ (పాణ్యం), అన్నపురెడ్డి బాల వెంకట్‌ (నందికొట్కూరు), విశ్వం ప్రభాకర్‌రెడ్డి (తంబళ్లపల్లె), చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌ (పలమనేరు)
Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh
Telangana
Assembly Election
Lok Sabha

More Telugu News