putalapattu: నిలకడగానే వైసీపీ ఎమ్మెల్యే సునీల్ ఆరోగ్యం.. పరామర్శించిన కార్యకర్తలు

  • కలిసేందుకు నిరాకరించిన జగన్
  • తీవ్ర మనస్తాపంతో  ఆత్మహత్యాయత్నం
  • ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తనకు టికెట్ కేటాయించకపోవడం, కనీసం కలిసేందుకు కూడా వైసీపీ అధినేత జగన్ అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ శనివారం ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించారన్న వార్తతో వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే పలువురు కార్యకర్తలు, సన్నిహితులు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సునీల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
putalapattu
MLA
Sunil
Suicide
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News