తండ్రీకొడుకులు చెరో 10 స్థానాల్లో నామినేషన్లు వేయండి.. చంద్రబాబు, లోకేశ్ లపై విజయసాయిరెడ్డి సెటైర్!
- టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు
- కులమీడియా, ఇంటెలిజెన్స్ ఉన్నా వలసలు ఆగడంలేదు
- ట్విట్టర్ లో ఘాటుగా విమర్శించిన వైసీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. పోటీకి అభ్యర్థులున్నారా చంద్రబాబు? కుల మీడియా, మీ బంధువు ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర్రావు అభ్యర్థులు జారి పోకుండా కాపలా కాస్తున్నా వలసలు ఆగడం లేదు. క్యాండిడేట్లు దొరకలేదని పరువుపోకుండా తండ్రీకొడుకులు చెరో 10 స్థానాల్లో నామినేషన్లు వేయండి’ అని సెటైర్ వేశారు.