24 రోజుల సమయం మాత్రమే ఉంది.. కంటిమీద కునుకులేకుండా పనిచేయాలి!: సీఎం చంద్రబాబు
- టీడీపీ శ్రేణులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
- ఏపీలో జరుగుతున్న ధర్మయుద్ధంలో విజయంపై ధీమా
- త్వరలోనే మిగతా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన
నిన్న చేపట్టిన చిత్తూరు, శ్రీకాకుళం పర్యటనలు విజయవంతం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందనీ, ఇది పార్టీకి శుభసూచకమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘ఉత్సాహంగా కదం తొక్కండి-ఉద్ధృతంగా ప్రచారం చేయండి’ అని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మనకు ఇంకా 24 రోజుల సమయం మాత్రమే ఉందనీ, కంటిపై కునుకు లేకుండా పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులే టీడీపీ తరఫున ప్రచార సారథులని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పెద్దకుమారుడిగా తన తరఫున 70 లక్షల మంది రైతన్నలు ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోటి మంది చెల్లెమ్మలు తనకు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.