జమ్మూ కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
- 15 మందితో రాజ్‌గఢ్ వెళుతున్న వాహనం
- మూలమలుపు వద్ద అదుపు తప్పిన వైనం
- సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్ముకు తరలించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందునే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.