జగన్ కు భద్రతను పెంచండి.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి!: అవంతి శ్రీనివాస్
- వివేకానందరెడ్డి హత్య షాక్ కు గురిచేసింది
- ప్రతిపక్షాలకే రక్షణ లేకుంటే సామాన్యుల సంగతేంటి?
- ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేత
వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హత్యారాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.