జగన్ ను మానసికంగా దెబ్బతీసేందుకే వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేశారు!: విజయసాయిరెడ్డి

  • కడపలో టీడీపీకి వివేక అడ్డుగా నిలిచారు
  • అందుకే దారుణంగా నరికి చంపారు
  • ఈ కుట్రకు చంద్రబాబు, లోకేశ్ లే బాధ్యులు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ను ఒంటరిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా నరికి చంపారని ఆరోపించారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన హిమాలయశిఖరంలా అడ్డుగా నిలిచారని వ్యాఖ్యానించారు.

అందుకే ఆయన్ను భౌతికంగా అంతం చేస్తే తప్ప జిల్లాలో పట్టుదొరకదని భావించి దారుణంగా నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లే బాధ్యులని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Kadapa District
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
Nara Lokesh
Twitter

More Telugu News