వినాశకాలం వచ్చింది కాబట్టే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు: సతీష్ రెడ్డి
- ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారు
- జనాలేం పిచ్చోళ్లు కాదు
- ఏది చెబితే అది నమ్మరు
- ప్రజల చేతిలో పరాభవం తప్పదు
పులివెందులలో చిన్న బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాచిన వాళ్ల వరకూ అందరికీ.. హత్యలు చేసే అలవాటు ఎవరికుందో తెలుసన్నారు. ఎదుటి వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల పులివెందుల ప్రజల చేతిలో పరాభవం తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులెవరో త్వరలోనే బయటపడుతుందని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.