India: జైషే చీఫ్ మసూద్ అజర్ కు ఎదురుదెబ్బ... ఆస్తులు స్తంభింపజేసిన ఫ్రాన్స్

కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ టెర్రర్ గ్రూపు అధినేత మసూద్ అజర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రవేయించడంలో భారత్ ఐరాసలో విఫలమైనా, ఫ్రాన్స్ మాత్రం తనవంతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మసూద్ అజర్ కు చెందిన ఆస్తులను స్తంభింపజేస్తున్నామంటూ ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి.

ఫ్రాన్స్ ఆర్థిక, ద్రవ్య విధానం అనుసరించి మసూద్ ఆస్తుల స్తంభనపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అంతేకాకుండా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజర్ పేరు కూడా చేర్చేలా ఫ్రాన్స్ కృషి చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మసూద్ అజర్ పై తీర్మానాన్ని చైనా వీటోతో కొట్టిపారేసిన కొన్నిరోజుల్లోనే ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకోవడం భారత్ కు గణనీయమైన విజయంగానే భావించాలి.
India

More Telugu News