సెట్స్ పైకి వెళ్లే దిశగా 'బంగార్రాజు'
- జూన్ నుంచి సెట్స్ పైకి
- భార్య పాత్రలో రమ్యకృష్ణ
- మనవడిగా కనిపించనున్న చైతూ
కల్యాణ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రకి భార్యగా రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు. ఇక ఆయన మనవడిగా చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో, చైతూ సరసన నాయికగా ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి వుంది.