Andhra Pradesh: కేసీఆర్ తో కుమ్మక్కై ఏపీని ఎడారిగా మారుస్తావా?: జగన్ పై చంద్రబాబు నిప్పులు

  • పోలవరం ప్రాజెక్టును టీఆర్ఎస్ అడ్డుకుంటోంది
  • అలాంటి పార్టీ చీఫ్ కేసీఆర్ తో జగన్ దోస్తీ చేస్తున్నారు
  • ఓటమి భయంతో జగన్ సైకో గేమ్ ఆడుతున్నారు
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అదే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ దోస్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో వైసీపీ అధినేత జగన్ సైకో గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ తో ఆయన మాట్లాడారు.

వైసీపీని బజారులో పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నారనీ, ఎవరు ఎక్కువ కప్పం చెల్లిస్తే వారికే టికెట్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ-బీజేపీ కుమ్మక్కును ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘కేసీఆర్ తో కుమ్మక్కు అయి ఏపీని ఎడారిగా మారుస్తావా.. కేసీఆర్ ఇచ్చే కోట్ల కోసం ఏపీని టీఆర్ఎస్ కు అమ్మేస్తావా?’ అని జగన్ ను ప్రశ్నించారు.
Andhra Pradesh
Telangana
KCR
Telugudesam
Chandrababu
TRS
YSRCP
Jagan
angry

More Telugu News