madan: నాకు అవకాశాలు తగ్గడానికి అదొక కారణమనుకుంటాను: దర్శకుడు మదన్

  • ఎప్పుడూ అవకాశాలు తన్నుకురాలేదు
  • కొన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు
  •  నన్ను చెక్ చేసుకుంటే అలా అనిపించింది    
తాజాగా 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో దర్శకుడు మదన్ మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు అవకాశాలు తన్నుకొచ్చింది లేదు .. అలాగే అసలు అవకాశాలు లేకపోవడమంటూ లేదు. నాకు తగిన అవకాశాలు వస్తూనే వున్నాయి .. అయితే అవి కూడా కొన్ని పరిస్థితుల కారణంగా కార్యరూపాన్ని దాల్చడంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది.

ఇక నాలో నాకు లోపంగా అనిపించేది చొరవ చూపకపోవడమేనని అనిపిస్తూ ఉంటుంది. కథలను రెడీ చేసుకుంటానుగానీ .. అపాయింట్ మెంట్ తీసుకుని కథలు వినిపించడానికి అంతగా చొరవ చూపించను. బాగా పరిచయమున్న హీరోలకి మాత్రమే మెసేజ్ పెడతాను .. వాళ్ల వీలును బట్టి కథలు వినిపిస్తాను .. అంతే. నన్ను నేను చెక్  చేసుకున్నప్పుడు .. కాస్త చొరవ చూపించగలిగితే బాగుంటుందేమోనని అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 
madan

More Telugu News