new zealan: న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి.. కాల్పులకు పాల్పడింది ఆస్ట్రేలియా వ్యక్తి

  • క్రైస్ట చర్చ్ లో రెండు మసీదులపై కాల్పులు
  • ఆస్ట్రేలియా జాతీయుడే కాల్పులకు పాల్పడ్డాడని తెలిపిన ఆసీస్ ప్రధాని
  • ప్రస్తుతం ఇంతకు మించి చెప్పలేనన్న మోరిసన్
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు తెగబడ్డారని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. అతివాద భావజాలం కలిగిన టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించిన వ్యక్తి అని తెలిపారు. ఘటనపై న్యూజిలాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని... ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంతకు మించి స్పందించలేనని చెప్పారు.
new zealan
christchurch
mosque
fire

More Telugu News