ముంబై మృతులకు రూ. 5 లక్షల పరిహారం: ప్రకటించిన ప్రభుత్వం
- గత రాత్రి కుప్పకూలిన పాదచారుల వంతెన
- నలుగురి మృతి.. 34 మందికి గాయాలు
- క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం.. పూర్తి వైద్య సేవలు
గురువారం రాత్రి స్టేషన్లోని పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘనటతో స్టేషన్లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.