కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన సోనియా ప్రధాన అనుచరుడు వడక్కన్!
- జవాన్ల త్యాగాలను కాంగ్రెస్ కించపరుస్తోంది
- జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది
- అది తట్టుకోలేకే రాజీనామా సమర్పించాను
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధానాలతో తాను మనస్తాపానికి గురయ్యానని వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదులు మన నేలపై దాడి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన ధోరణి నాకు నచ్చలేదు. ఏ పార్టీ అయినా దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి విధానాలు అనుసరిస్తే దాన్ని మనం ప్రోత్సహించకూడదు. నాకు వేరే దారి లేకపోవడంతో పార్టీని వీడుతున్నా’ అని తెలిపారు. వడక్కన్ కాంగ్రెస్ పార్టీలో వేర్వేరు హోదాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.