YSRCP: పార్టీ క్యాడర్ ను అలర్ట్ చేసిన వైఎస్ జగన్!

  • ఓటరు నమోదుకు రేపటితో ముగియనున్న గడువు
  • తుది సమరానికి సిద్ధం కండి
  • ట్విట్టర్ లో క్యాడర్ తో వైఎస్ జగన్
మరో నాలుగు వారాల్లో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను వైఎస్ జగన్ అలర్ట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ ను ఉంచారు. ఎన్నికల తుదిసమరానికి సిద్ధం కావాలని కోరారు.

"వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవల్‌ క్యాడర్‌ అందరికీ... గడచిన నాలుగు సంవత్సరాలుగా మనం ఎంతో శ్రమించాం. ఈ చివరి అడుగుల్లో మరింతగా శ్రమించాలి. వచ్చే రెండు రోజుల్లో ప్రతి ఓటును తనిఖీ చేయండి. పోలింగ్‌ రోజున ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి. రానున్న 27 రోజుల్లో మీ నుంచి మరింత మద్దతును కోరుతున్నా" అని జగన్‌ ట్వీట్‌ చేశారు.



YSRCP
Jagan
Twitter

More Telugu News