Tollywood: జయరామ్ మర్డర్ కేసులో సినీ నటుడు సూర్యప్రసాద్ అరెస్ట్

  • అంజిరెడ్డి, కిశోర్ లనూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వీరందరికీ జయరామ్ ను హత్య చేస్తారని తెలుసన్న పోలీసులు
  • నేడు కోర్టు ముందు హాజరు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటుడు సూర్యప్రసాద్ (ఆ నలుగురు ఫేమ్) సహా అంజిరెడ్డి, కిశోర్ లను పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. జయరామ్ హత్యను అంజిరెడ్డి కళ్లారా చూశాడని, ఆయన్ను చంపేస్తున్నారన్న విషయం సూర్యప్రసాద్, కిశోర్ లకు ముందుగానే సమాచారం ఉందని నిర్ధారించుకున్నాకే వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హత్య జరుగుతుందని తెలిసినా పోలీసులకు వీరు సమాచారం ఇవ్వలేదని అన్నారు. వీరిని నేడు కోర్టు ముందు హాజరు పరుస్తామని తెలిపారు. 
Tollywood
Jayaram
Murder
Suryaprasad
Arrest
Police

More Telugu News