Jagan: జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే

  • మార్చి 16 నుంచి ప్రచారం 
  • ప్రచారంలో షర్మిల, విజయమ్మ
  • రోజుకు 4 నియోజకవర్గాల్లో ప్రచారం
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఈసారి జరిగే ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈసారి గెలుపే పరమావధిగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్న జగన్ మరికొన్నిరోజుల్లో ప్రచార పర్వానికి బయల్దేరనున్నారు. కొన్నిరోజుల వ్యవధిలోనే హెలికాప్టర్ లో 45 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఆయన మార్చి 16న ఇడుపులపాయ నుంచి ప్రచారం మొదలుపెట్టి, అదే రోజు గురజాలలో సభలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు. ఆ మరుసటి రోజు మార్చి 17న నెల్లిమర, గన్నవరం ప్రాంతాల్లో రాజకీయ ప్రచార సభలకు హాజరవుతారు. ఇక, వైసీపీ ప్రచారంలో వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పాల్గొంటారని సమాచారం. వీరిద్దరూ రోజుకు 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందించాయి.
Jagan
YSRCP

More Telugu News