Jagan: పులివెందులలో నామినేషన్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జగన్

  • ఈ నెల 22న పులివెందులలో నామినేషన్
  •  త్వరలోనే ప్రచారం
  • ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలో తలమునకలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ మార్చి 22న నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్న జగన్ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల పూర్తి జాబితా వెల్లడించిన తర్వాత సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టనున్నారు.

వైసీపీలోకి నేతలు, ఇతర రంగాల ప్రముఖులు వెల్లువలా వస్తుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల కన్వీనర్లుగా ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే క్యాడర్ పరిస్థితి ఏంటన్నది జగన్ ను డైలమాలో పడేస్తోంది. అందుకే తొలి విడతగా 75 మంది పేర్లు వెల్లడించి, ఆపై పరిస్థితులను బట్టి రోజుకు 25 మంది చొప్పున పేర్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం అభ్యర్థుల పేర్లన్నీ వెల్లడయ్యాక జగన్ ప్రచారబరిలో దిగుతారని పార్టీ వర్గాలంటున్నాయి.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News