North Korea: వింత కాక మరేంటి?.. ఉత్తర కొరియా ఎన్నికల్లో 99.99 శాతం పోలింగ్

  • దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారీ ఓటింగ్
  • కిమ్ ఓటేయకపోవడంతో వందశాతం మిస్
  • ప్రజాస్వామ్య దేశాలకు కలలోనైనా సాధ్యం కాని రికార్డు
మనదేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ అంతంత మాత్రమే ఉంటుంది. ఓటింగ్ 50 శాతం దాటితే మహా గొప్ప. ఒక్కోసారి 80 శాతం దాటిన సందర్భాలున్నా అది చాలా అరుదు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది నిజంగా వింతే. ఉత్తరకొరియాలో జరిగింది. ఒక్క అభ్యర్థి కోసం జరిగిన ఈ ఎన్నికల్లో ఏకంగా 99.99 ఓటింగ్ శాతం నమోదైంది. గతంలో 99.97 శాతంతో ఉన్న రికార్డు ఇప్పుడు మాయమైంది. ప్రతీ ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలు రబ్బరు స్టాంప్ మాత్రమేనన్న సంగతి అందరికీ తెలిసిందే.

సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (ఎస్‌పీఏ)గా పిలిచే పార్లమెంటుకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఈ వింత చోటు చేసుకుంది. మొత్తం 687 మందిని ఎన్నుకునేందుకు జరిగిన రబ్బర్ స్టాంప్ ఓటింగ్ ఇది.

 ప్రతీ ఓటింగ్ స్లిప్‌లోనూ ఒకరి పేరు ఉంటుంది. ప్రజలందరూ చచ్చినట్టు అతడికే ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్కర్స్ పార్టీ అధినేత అయిన కిమ్ జోంగ్ ఉన్ చేతిలో ఉత్తరకొరియా ఉంది. నిజానికి ఈ సారి వందశాతం ఓటింగ్ జరగాల్సి ఉండగా కిమ్ ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో అది మిస్సయింది.  
North Korea
election
99 per cent
Kim jong un
Polling

More Telugu News