Ganta Srinivasa Rao: నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు!

  • ఎంపీగా పోటీ చేయాలని సూచించిన చంద్రబాబు
  • ఎంపీగా పోటీకి గంటా విముఖత
  • అజ్ఞాతంలోకి వెళ్లడంతో కొత్త చర్చ
ఈ దఫా ఎమ్మెల్యేగా కాకుండా, ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించడంతో, అది ఇష్టంలేని మంత్రి గంటా శ్రీనివాసరావు, నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాను అమరావతికి వెళుతున్నానని చెప్పిన ఆయన, హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని ఓమారు, టీడీపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరితే, ఆయనకు ఆ స్థానం కేటాయిస్తారని మరోమారు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం కొత్త చర్చకు తెరలేపింది.
Ganta Srinivasa Rao
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Bhimili

More Telugu News