Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*   ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్న కథానాయిక తాప్సీ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. అతీంద్రియ శక్తుల కథాంశంతో థ్రిల్లర్ గా ఇది రూపొందుతుందట.
*  మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ ఈ నెల మూడో వారం నుంచి దుబాయ్ లో జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది.
*  తమిళ చిత్ర కథానాయకుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని జయం రాజా దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
Go Back to Shorts
Tapsi
Mahesh Babu
Puja
Vijay

More Telugu News