పోటీకి సిద్ధమవుతున్న మాయావతి మాజీ సెక్రటరీ.. దాడులతో విరుచుకుపడిన ఐటీ
- ఐఏఎస్ అధికారి నేత్రం మాయావతికి సన్నిహితుడు
- వంద కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అనుమానం
- 12 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతికి నేత్రం సన్నిహితుడిగా పేరుపడ్డారు. అంతేకాదు, ఈసారి ఆయన బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో లక్నోలోని ఆయన నివాసంతోపాటు కోల్‌కతా, ఢిల్లీల్లోని కార్యాలయాలపైనా ఐటీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.