14న రాజమౌళి మీడియా సమావేశం... ఆ రోజుతో వీడనున్న 'ఆర్ఆర్ఆర్' సస్పెన్స్!
- 'ఆర్ఆర్ఆర్'పై కొనసాగుతున్న సస్పెన్స్
- సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పుకార్లు
- కొంత సస్పెన్స్ ను తొలగించనున్న రాజమౌళి
వాస్తవానికి రాజమౌళి సినిమాను ప్రారంభించే రోజే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను రివీల్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈగ, బాహుబలి, మర్యాదరామన్న వంటి సినిమాల విషయంలో అదే జరిగింది. అయితే, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా, 'ఆర్ఆర్ఆర్' గురించి మాత్రం ఏ వివరమూ వెల్లడి కాలేదు. ఇక ఈ సస్పెన్స్ కు తెరదించుతూ 14వ తేదీన రాజమౌళి మీడియా సమావేశం నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన కొంత సస్పెన్స్ వీడిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మీడియా సమావేశం విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.