Pawan Kalyan: పవన్‌పై ఆ ముద్ర వేస్తారనే జనసేనకు నేను దూరంగా ఉంటున్నా: నాగబాబు

  • శరవేగంగా పావులు కదుపుతున్న పవన్
  • అధికారం ఉంది కదా అని కేసులు పెడుతున్నారు
  • జనసేనకు అభిమానిని మాత్రమే
ఎన్నికలకు ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన జనసేనాని.. ఇప్పటికే 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నేడు జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేనకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించారు. తాను జనసేన పార్టీకి అభిమానిని మాత్రమేనని.. నాయకుణ్ని కాదన్నారు. తన తమ్ముడు పవన్‌పై బంధుప్రీతి ముద్ర వేస్తారేమోనని జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నానన్నారు. జనసేన కార్యకర్తలపై అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Nagababu
Janasena
Elections
Meeting

More Telugu News