Kurnool District: చరితమ్మకే పాణ్యం టికెటిస్తున్నా...గెలిపించే బాధ్యత మీదే: చంద్రబాబు

  • భారీ మెజార్టీతో ప్రత్యర్థులను కంగుతినిపించాలి
  • నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది
  • పలు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌
కర్నూల్‌ జిల్లా పాణ్యం నుంచి గౌరు చరితమ్మనే పోటీ చేయిస్తున్నానని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి ప్రత్యర్థులు కంగుతినేలా చేయాల్సిన బాధ్యత మీదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం పాణ్యం టికెట్టు ఆమెకే కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చరితమ్మను గెలిపించే బాధ్యత మీదైతే, నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హంద్రీనీవా నుంచి చెరువులకు నీళ్లు విడుదల, గాజులదిన్నె తూము నిర్మాణానికి రూ.5 కోట్ల మంజూరు వంటి పనులకు అప్పటికప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.
Kurnool District
panyam
gouru charitha
Chandrababu

More Telugu News