YSRCP: విజయవాడ వైసీపీ సమర శంఖారావం సభ ఒక రోజు వాయిదా

  • 13న రామవరప్పాడులో జరగాల్సిన సభ
  • 14వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించిన పార్టీ వర్గాలు
  • షెడ్యూల్‌ ప్రకారం 11న జరగనున్న కాకినాడ సభ
వైసీపీ సమర శంఖారావం సభ వాయిదా పడింది.  వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పూర్తిచేసిన అనంతరం జిల్లాకో  సమరశంఖారావం సభకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ పట్టణం రామవరప్పాడులో ఈనెల 13వ తేదీన సభ జరగాల్సి ఉంది. ఈ సభను మరునాటికి అంటే 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించ లేదు. ఆ రోజు సభ నిర్వహణకు  పార్టీ శ్రేణులు చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం (11న) నిర్వహించ తలపెట్టిన సభ యథావిధిగా సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
YSRCP
samara shankaravam
Vijayawada
postpone

More Telugu News