maa: ఓటు వేయడానికి ఒకే కారులో వచ్చిన చిరంజీవి, నాగార్జున

  • మా ఎన్నికల్లో ఓటు వేసిన చిరంజీవి, నాగార్జున
  • మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్
  • అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నరేష్, శివాజీరాజా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో పోలింగ్ జరుగుతుండగా... ఇప్పటికే పలువురు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపటి క్రితం చిరంజీవి, నాగార్జునలు ఫిలిం ఛాంబర్ కు వచ్చి, ఓటు వేశారు. ఇద్దరూ కలసి ఒకే కారులో రావడం విశేషం. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం నరేష్, శివాజీరాజాలు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కిపు మొదలవుతుంది.
maa
elections
Chiranjeevi
nagarjuna
nagababu
tollywood

More Telugu News