అనంతపురంలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
- జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఘటన
- భారీ శబ్దంతో కంపించిన భూమి
- రాత్రంతా ఇళ్ల బయటే గడిపిన గ్రామస్తులు
ఇళ్లన్నీ కొద్దిసేపు ఊగిపోవడంతో గ్రామస్తులు భయాందోళనలకు లోనయ్యారు. చాలామంది రాత్రంతా ఇళ్ల బయటే గడిపారు. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఇలాంటి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. అర్ధరాత్రి పెద్ద శబ్దంతో ఈ ప్రకంపనలు వచ్చాయన్నారు.