చంద్రబాబుకు 2 ఎంపీ సీట్లు కూడా రావని తెలిసింది.. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు లైట్ తీసుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి
- ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో మమతకు బాబు ఫోన్ చేశారు
- వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆమె మాట్లాడలేదు
- ట్విట్టర్ లో చంద్రబాబుపై వైసీపీ నేత సెటైర్లు
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘డేటా చోరీ కేసులో మద్దతు కోరేందుకు మమతా దీదీకి వారం రోజులుగా చంద్రబాబు ఫోన్ చేస్తున్నా అసలు మాట్లాడటానికే దీదీ ఇష్టపడటం లేదు. ఈయనకు రెండు ఎంపీ సీట్లు కూడా రావని తెలిసినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల నాయకులు లైట్ గా తీసుకుంటున్నారు. ఏమీ సేతుర లింగా అని పాడుకోవడమే మిగిలింది’ అని ట్వీట్ చేశారు.