Vizag: డబ్బు కోసం భార్యను చీకటి గదిలో బంధించి విచక్షణా రహితంగా దాడి

  • ఒంటి నిండా వాతలు పెట్టిన భర్త
  • తన మాట వినలేదని తీవ్ర ఆగ్రహం
  • లేఖ ద్వారా దారుణాన్ని చెప్పిన లక్ష్మి
విశాఖలో దారుణం వెలుగు చూసింది. డబ్బు కోసం ఓ భర్త తన భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. భార్య రాసిన లేఖ ద్వారా స్థానికులకు విషయాలన్నీ తెలియడంతో పోలీసులు, విలేకరుల సాయంతో ఆమెకు భర్త చెర నుంచి విముక్తి కల్పించారు. లక్ష్మీ అనే మహిళను ఆమె భర్త చీకటి గదిలో నిర్బంధించి ఒంటి నిండా వాతలు పెట్టాడు. అతను చెప్పిన మాట వినలేదన్న అక్కసుతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. లక్ష్మిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దారుణాన్నంతా లేఖ ద్వారా లక్ష్మి కాలనీవాసులకు తెలియజేసింది. తనకు భర్త చెర నుంచి విముక్తి కలిగిన వెంటనే లక్ష్మి దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Vizag
Lakshmi
Husband
Attack
Letter
Police Station

More Telugu News