India: బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పరారైన పాక్ డ్రోన్

  • రాజస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
  • డ్రోన్ ను కూల్చేందుకు భారీగా కాల్పులు
  • తృటిలో తప్పించుకున్న పాక్ మానవరహిత విమానం
భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఓ డ్రోన్ భారత్ లో ప్రవేశించగా దాన్ని వాయుసేన కూల్చివేసిన సంఘటన మరువకముందే మరో డ్రోన్ సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించింది. రాజస్థాన్ లోని హిందుమల్ కోట్ సమీపంలో ఉన్న శ్రీగంగానగర్ వద్ద ఈ ఘటన జరిగింది.

భారత గగనతలంలో డ్రోన్ ను గమనించిన బీఎస్ఎఫ్ దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అది పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ అని గమనించి వెంటనే భారీగా కాల్పులు జరిపారు బీఎస్ఎఫ్ జవాన్లు. అయితే, ఆ డ్రోన్ కొద్దిలో తప్పించుకుని మళ్లీ పాక్ తిరిగి వెళ్లింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తమకు తుపాకీ కాల్పుల మోత వినిపించిందని సమీప గ్రామాల ప్రజలు తెలిపారు. భారత్ లో చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ డ్రోన్ తమ దళాల ధాటికి తోకముడిచిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
India
Pakistan

More Telugu News