‘గరుడపురాణం’ అంటూ గతంలో కథలు చెప్పాడు.. ఇప్పుడు పిచ్చికూతలు కూస్తున్నాడు!: శివాజీపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్
- తప్పు చేయకుంటే అశోక్ ఎందుకు పరారయ్యాడు?
- శివాజీతో బాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారు
- నటుడిపై మండిపడ్డ వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్
గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ.. ఇప్పుడు డేటా చోరీ వ్యవహారంలో పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులకు చంద్రబాబు ‘కీ’ ఇచ్చి ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపించడంతోనే ఏపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టకుండా యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. శివాజీ పనీపాటా లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించిరావని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.