యూట్యూబ్ లో చూసి గ్రనేడ్ తయారీ.. జమ్మూ బాంబు దాడి కోసం స్కూలు పిల్లాడిని ఎంచుకున్న ఉగ్రవాదులు!
- భారీ భద్రతను తప్పించుకుని దాడి చేసిన మైనర్ బాలుడు
- హిజ్బుల్ కమాండర్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు
- టిఫిన్ బాక్స్ లో బాంబును తీసుకొచ్చి దాడిచేసిన నిందితుడు
యూట్యూబ్ లో వీడియోలను చూసి నిందితుడు గ్రనేడ్ తయారుచేశాడని పోలీసులు తెలిపారు. దాన్ని టిఫిన్ బాక్సులో పెట్టుకుని వచ్చి బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా మాట్లాడుతూ.. నిందితుడు కుల్గాం జిల్లా హిజ్బుల్ చీఫ్ ఫరూక్ అహ్మద్ భట్ తో టచ్ లో ఉన్నాడని వెల్లడించారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. సదరు బాలుడు ఓ కారులో 250 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూకు వచ్చాడనీ, అతడిని తీసుకొచ్చిన డ్రైవర్ కోసం గాలింపు జరుపుతున్నామన్నారు.