Prakasam District: వైసీపీలో చేరిన ఎంఎంఆర్‌ గ్రూప్‌ సీఎండీ మన్నెం మధుసూదనరావు

  • ఈరోజు లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో చేరిక
  • జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడి
  • దళిత వర్గం నుంచి వచ్చి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన మన్నెం
ప్రముఖ పారిశ్రామికవేత్త, దళిత వర్గం నాయకుడు మన్నెం మధుసూదనరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎంఎంఆర్‌గా పారిశ్రామిక వర్గాల్లో పేరున్న మధుసూదనరావు సాధారణ దళిత కుటుంబంలో పుట్టి స్వశక్తితో పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఎంఎంఆర్‌ గ్రూపు సంస్థలకు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈరోజు లోటస్‌ పాండ్‌లో జగన్‌ను కలిసి పార్టీలో చేరగా, ఆయనకు జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంఎంఆర్‌ మాట్లాడుతూ దళితులతోపాటు అన్ని వర్గాలు సమగ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వేతర సంస్థ ద్వారా దళితులు, బీసీల అభ్యున్నతి కోసం పనిచేశానని, ఇప్పుడు మరింత విస్తృత వేదిక లభించినట్టయిందని అన్నారు. అధినేత అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంఎంఆర్ డీఐసీసీఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Prakasam District
industrialist MMR
YSRCP
Jagan

More Telugu News