పుల్వామా తరహా మరో ఆత్మాహుతి దాడికి సిద్ధమైన జైషే మొహమ్మద్
- బాలాకోట్ దాడికి ప్రతీకారంగా దాడికి సిద్ధమవుతున్న జైష్
- 3, 4 రోజుల్లో దాడి జరిగే అవకాశం
- ఈసారి టాటా సుమో వాహనాన్ని వాడే అవకాశం
బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు ప్రతీకారంగా జైష్ ఈ దాడికి పాల్పడబోతోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల ప్రకారం దక్షిణ కశ్మీర్ లోని క్వాజీగుండ్, అనంత్ నాగ్ ప్రాంతాల్లో ఐఈడీ దాడి జరిగే అవకాశం ఉంది. ఈ సారి టాటా సుమో వాహనాన్ని మానవబాంబులు వాడే అవకాశం ఉంది.