అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ఉత్తర కోస్తా!
- వాయవ్య బంగాళాఖాతం నుంచి ద్రోణి
- పిడుగులతో కూడిన వర్షాలు
- ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గనున్న వడగాడ్పుల ప్రభావం
ద్రోణి ప్రభావంతో, వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం పడవచ్చని ఆంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయి. గత వారంతో పోలిస్తే, వడగాడ్పుల ప్రభావం తగ్గినా, ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది.