Andhra Pradesh: చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలనుకుంటున్నారు: వైసీపీ నేత అంబటి

  • ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారు
  • ‘సేవామిత్ర’ యాప్ ని ఎందుకు క్లోజ్ చేశారు?
  • డేటా చోరీ కేసుపై విచారణకు చంద్రబాబు సిద్ధమా?
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అడ్డదారుల్లో గెలవాలనుకుంటున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. డేటా చోరీకి పాల్పడలేదని చెబుతున్న టీడీపీ, తమ ‘సేవామిత్ర’ యాప్ ని ఎందుకు క్లోజ్ చేసిందో చెప్పాలని, డేటా చోరీ కేసులో తాము అడిగిన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. డేటా చోరీ కేసుపై విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ ని ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు.  
Andhra Pradesh
Chandrababu
YSRCP
ambati

More Telugu News