Mahesh Babu: మహేశ్ బాబు సరసన రష్మిక మందన?

  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు
  •  ఒక కథానాయికగా సాయిపల్లవి?
  • త్వరలోనే సెట్స్ పైకి    
ఒక వైపున మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' చకచకా షూటింగ్ జరుపుకుంటూ వుంటే, మరో వైపున ఆయన 26వ సినిమాకి అంతే వేగంగా సన్నాహాలు జరిగిపోతున్నాయి. మహేశ్ తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉందనే సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పనులతోనే అనిల్ రావిపూడి బిజీగా వున్నాడు.

ఒక వైపున స్క్రిప్ట్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున మిగతా నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక కథానాయికగా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారనే టాక్ వచ్చింది. తాజాగా రష్మిక మందన పేరు తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో సాయిపల్లవికి మంచి ఆదరణ వుంది. ఇక యూత్ లో రష్మికకి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ రెండు వర్గాలను థియేటర్లకు రప్పించడం కోసం అనిల్ రావిపూడి ఈ ఇద్దరినీ సెట్ చేసి ఉండొచ్చని  అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Mahesh Babu
saipallavi
rashmika

More Telugu News