అటార్నీ జనరల్ వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం
- అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామనడంపై గుర్రు
- బెదిరింపులకు దిగితే సహించమని హెచ్చరిక
- రాఫెల్ వివాదం నేపథ్యంలో రచ్చ
కోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ రక్షణ పత్రాలను అపహరించిన వారిపై అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ద హిందూతోపాటు ఇతర పత్రికలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ఎడిటర్స్ గిల్డ్ తప్పుపట్టింది. తమ ఆధారాలను వెల్లడించాల్సిందిగా ఒత్తిడి చేస్తూ అధికార రహస్యాల చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.