anasuya: అనసూయ 'కథనం' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • అనసూయకి మంచి క్రేజ్ 
  • నాయిక ప్రాధాన్యత గల 'కథనం'
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
అనసూయ ప్రధాన పాత్రధారిగా 'కథనం' సినిమా రూపొందింది. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అవసరాల శ్రీనివాస్ .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

'మహిళా దినోత్సవం' సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. అనసూయ ఇంతకుముందు చేసిన 'క్షణం' .. 'రంగస్థలం' సినిమాల్లోని పాత్రలు ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. ఆమె 'క్షణం' సినిమా చేసినప్పుడే .. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను అనసూయతో చేసేయవచ్చనే టాక్ వచ్చింది. అలాంటి అవకాశం ఆమెకి 'కథనం'తో వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అనసూయ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుందేమో చూడాలి.
anasuya
avasarala
dhanraj

More Telugu News