ఎండలు పెరిగాయి... జాగ్రత్తలు తీసుకోండి!: తెలంగాణ విపత్తుల నిర్వహణా సంస్థ
- మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- ఆరుబయట పనిచేస్తుంటే టోపీ తప్పనిసరి
- వడదెబ్బ తగిలితే చల్లని వస్త్రం తలకు చుట్టాలి
- గోడపత్రికను ఆవిష్కరించిన అధికారులు
ఆరుబయట పనిచేసే వారు తలపైన టోపీని తప్పనిసరిగా ధరించాలని, కాఫీలు, టీలు ఎక్కువగా తాగరాదని, ప్రమాదవశాత్తూ వడదెబ్బ తగిలితే, సదరు వ్యక్తి తలకు చల్లటి వస్త్రాన్ని చుట్టాలని సూచించింది. సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ బయట తిరగరాదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే, గొడుగు వాడకాన్ని మరువరాదని తెలిపింది. ఎండవేళ, ప్రజలకు మంచినీళ్లను అందించేందుకు హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది.