kcr: నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

  • హైదరాబాదు నుంచి దేవరకొండవైపు వస్తున్న బొలెరో వాహనం 
  • ఆర్టీసీ బస్సును ఢీ కొన్న బొలెరో 
  • మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన కేసీఆర్
నల్గొండ జిల్లా చెన్నారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా, మరో 15 మంది గాయపడ్డారు. హైదరాబాదు నుంచి దేవరకొండవైపు వస్తున్న బొలెరో వాహనం కొండమల్లెపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే హైవేపై దాని టైర్ పేలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అది ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
kcr
road accident
TRS
Nalgonda District

More Telugu News