senior naresh: శివాజీరాజాకి నా అంత అనుభవం లేదు: సీనియర్ నటుడు నరేశ్

  • రాజేంద్రప్రసాద్ తో ఆ మాట చెప్పాను
  • ఆయన హుందాగా తప్పుకున్నారు
  • శివాజీరాజా పనితీరుపై అసంతృప్తి వుంది
మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా శివాజీరాజా పదవీకాలం పూర్తికావడంతో, మళ్లీ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. శివాజీ రాజా మళ్లీ పోటీకి సిద్ధం కాగా .. సీనియర్ నరేశ్ కూడా రంగంలోకి దిగారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఇద్దరూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా సీనియర్ నరేశ్ మాట్లాడుతూ .. " గతంలో నేను నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ కి ఒక మాట చెప్పాను .. అందరం కూడా ఒక్కో టర్మ్ అధ్యక్షుడిగా చేసి తప్పుకుందామని చెప్పాను. దాంతో ఆయన ఒక టర్మ్ పూర్తి చేసి చాలా హుందాగా పక్కకి తప్పుకున్నాడు. అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

ఆ తరువాత శివాజీరాజా కోరిక మేరకు ఆయన అధ్యక్షుడు కావడానికి సహకరించాను. ఆయనకి నా అంత అనుభవం లేకున్నప్పటికీ, మంచి మనసుతో అండగా నిలిచాను. కొన్ని కారణాల వలన శివాజీ రాజా పనితీరుపై చాలామందిలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. అందువలన నేను రంగంలోకి దిగాను. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే సరికొత్త విధానాలతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో వున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
senior naresh

More Telugu News