Modugula Venugopal Reddy: బావ పిలిచాడు... 9న వెళుతున్నా!: వైసీపీలో చేరికపై మోదుగుల
- అయోధ్య రామిరెడ్డి పిలుపుతో పార్టీ మారుతున్నా
- తనతో పాటు వచ్చేవాళ్లు రావచ్చన్న మోదుగుల
- పార్టీని వీడేముందు నేతలతో గ్రూప్ ఫోటో
"నా బావ ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నా. నాతోపాటు వచ్చేవారు రావచ్చు" అని తెలుగుదేశం పార్టీకి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసి చర్చించిన ఆయన, ఆపై తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, రాజీనామా చేయాలనే నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు పంపిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, 9వ తేదీన వైసీపీలో చేరనున్నట్టు వెల్లడించారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నానని, రాష్ట్రానికి విభజన హామీలు అమలు కావాలంటే, అది జగన్ తోనే సాధ్యమని నమ్ముతున్నానని అన్నారు. పార్టీని వీడేముందు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో మోదుగుల గ్రూప్ ఫోటో దిగడం విశేషం.